అర్హులందరికీ ఆసరా పింఛన్లు
– ఎమ్మెల్యే రెడ్యానాయక్
డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి
భారతదేశంలో ఏ రాష్ట్రములో ఇవ్వని పింఛన్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారని మరోసారి కేసీఆర్ ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రజలు కోరారు.మండల పరిధి మన్నెగూడెం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో పాలకులు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.
కొన్నాళ్లు రూ.70,మరికొన్నాళ్లు రూ.200 చొప్పున పింఛన్లు ఇచ్చారని గుర్తు చేశారు.తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ 2016 చొప్పున పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.అర్హులైన లబ్ధిదారులు ఆసరా పింఛను అందని ఆందోళన చెందవలసిన పనిలేదన్నారు అందరికీ మంజూరు చేస్తారని తెలిపారు.ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో ఎమ్మార్వో వివేక్,ఎంపీడీవో అపర్ణ,జడ్పిటిసి కమల రామనాథం,ఎంపీపీ బాలు నాయక్,వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి,మండలాధ్యక్షుడు నున్నా రమణ,సొసైటి వైస్ చైర్మన్ ఎలమద్ది మన్మధరావు, సర్పంచులు అంజయ్య,మోహన్,రాంప్రసాద్,పూల్ సింగ్,వరలక్ష్మి నాగేశ్వరరావు,రాధిక సీతారాం రెడ్డి, ఎంపీటీసీలు నంజ్యాల నాగమణి మధు,కొండపల్లి విజయపాల్ రెడ్డి,నీల రమేష్,యూత్ మండలాధ్యక్షుడు హరీష్,కో ఆప్షన్ సభ్యులు లాలూ మియా,వీరభద్రం,జటంకి హైమావతి,కార్యదర్శులు,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.