అర్హులందరికీ బీసీ బంధు ఇవ్వాలి
భైంసా ;రూరల్ జనం సాక్షి ఆగస్టు24
అర్హులైనవారందరికి బీసీ బంధు ఇవ్వాల్సిందేనని మహాగాం సిద్దూర్ చింతల్ బోరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం భైంసా పట్టణంలోని నిర్మల్–భైంసా రహదారిపై సర్పంచ్ రాకేష్ బీసీ నాయకుడు సుంకేట పోశెట్టి ఆధ్వర్యంలో రాస్తారోఖో చేశారు. మహగాం గ్రామం నుండి వందలాది మంది భైంసా టౌను చేరుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. బీసీలోని చాలా కులాల్లో పేద కుటుంబాలు ఉన్నాయని, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. కొందరికే బీసీ బంధు ఇస్తున్నారని, అనర్హులకు కూడా అంటగడుతున్నారని ఆరోపించారు. అర్హులైన బీసీలందరికీ పథకం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సుమారు గంటన్నరకు పైగా రాస్తారోఖో కొనసాగింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎంపీడీవో డౌన్ డౌన్ రావాలి రావాలి ఎమ్మెల్యే రావాలి అంటూ నినాదాలు చేశారు ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఎల్ శ్రీను సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు తమకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు ఇరువైపుల భారీగా వాహానాలు నిలిచిపోయాయి. పోలీసులు హమి ఇవ్వడంతో శాంతించారు.