అర్హులైన ఓటర్ లు ఓటర్ గా డిసెంబర్ 8 లాగా నమోదు చేసుకోవాలి.

నేడు,రేపు( డిసెంబర్ 3,4) ఓటర్ నమోదుకు పోలింగ్ బూత్ ల వారీగా ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు
 ఓటర్ జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి
 నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
ఓటరు జాబితాలో ఓటరు నమోదు,
మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న  స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని   ఓటరు జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి పేర్కొన్నారు.శుక్రవారం  కలెక్టరేట్ కార్యాలయం లో కలెక్టర్ ఛాంబర్ లో ఓటరు జాబితా  పరిశీలకురాలు విజయేంద్ర బోయి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తో   కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు పై ఆమె అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా  ఓటర్ జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక పౌరుడు  ఓటు హక్కును కలిగి ఉండాలని,  జనవరి  1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండిన  ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం డిసెంబర్ 8 వ తేది లోగా తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు.
*నేడు రేపు ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు*.                       నేడు,రేపు (డిసెంబర్ 3,4) జిల్లాలోని 1747 పోలింగ్ బూత్ లలో ఓటర్ నమోదు,ఓటర్ జాబితా లో మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.రాజకీయ పార్టీలు కూడా 1 జనవరి 2023 నాటికి 18 సంవత్సరం లు నిండిన ఓటర్ ను ఓటర్ గా నమోదు కు సహకరించి నూతన ఓటర్ లను జిల్లాలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు.అదే విధంగా 1 ఏప్రిల్ 2023,1 జూలై 2023,1 అక్టోబర్ 2023 నాటికి 18 సం.లు నిండిన వారు కూడా ఫారం 6 ద్వారా బి.ఎల్. ఓ లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు   ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు.  జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.చనిపోయిన,షిఫ్ట్ అయిన ఓటర్లు తొలగించాలని అన్నారు.    జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ ఏజెంట్ ను నియమించుకోవాలని  సూచించారు.
బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు  సమన్వయంతో పని చేసి తప్పులు లేని పరిశుద్ధమైన ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు.    అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి  బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించుటకు కళాశాలలలో స్పెషల్ క్యంపైన్ నిర్వహించాలని తెలిపారు.అప్ లైన్ లో తోపాటు యువత  ఆన్ లైన్ లో nvsp portal పోర్టల్,ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ ద్వారా కూడా చేసుకునేలా అవగాహన కలిగించాలని అన్నారు.
 ఓటరు జాబితా లో  వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులను డిసెంబర్  డిసెంబర్ 28 లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.1 జనవరి 2023 నాటికి 18 సం.లు నిండిన వారిని అర్హులైన ఓటర్ లతో 5 జనవరి 2023 న ఓటర్ తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.
 ఓటర్ కార్డునూ ఆదార్ కార్డుతో అనుసంధించాలని రాజకీయ పార్టి ప్రతినిధులు ఆమెకు విజ్ఞప్తి చేసారు.జిల్లా  కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూజిల్లాలో  స్వేప్  కార్యక్రమాలు లో భాగంగా అన్ని కాలేజిలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి, సూపరిండెం ట్ కృష్ణ మూర్తి,ఎన్నికల డి.టి.విజయ్,పి.లింగ స్వామి(  బిజెపి),రాం ప్రసాద్ (బీఎస్పీ), ఎన్.సత్యం( సిపిఐ),ఎం.డి.సలీం( సిపిఎం),శంకర్ నాయక్(కాంగ్రెస్),పిచ్చయ్య ( టి.అర్.ఎస్), రజి యుద్దీన్ (ఎం. ఐ.ఎం),సత్య నారాయణ (టి.డి.పి)  తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు