అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి

వీపనగండ్ల ఆగస్టు 29 (జనంసాక్షి)
సిపిఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని సోమవారం నాడు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది బద్రి నాయక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామని ఆన్లైన్లో ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది, మండలంలో 1500 పైగా అప్లికేషన్లు పెడితే, 899 మాత్రమే పింఛన్లు మంజూరు కావడం జరిగింది. ఇంకా వెయ్యి మంది పైగా అరులైన వారికి పింఛన్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని, అర్హులైన వికలాంగులకు, వృద్ధాప, వితంతు పింఛన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ప్రాణం ఉన్న రోజులో అర్హులు ఉన్న వారిని సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణయ్య మాజీ సర్పంచ్, మండల నాయకులు ఈశ్వర్, బాలగౌడ్, వి కృష్ణయ్య, తిరుపతయ్య, జానీ* తదితరులు పాల్గొన్నారు.