వెంకటాద్రి రైల్లో దుండగుల బీభత్సం… నగలు చోరీ
కాచిగూడ : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగతనం జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్ గౌడ్ భార్య ఎం కల్పన(50) వెంకటాద్రి రైల్లో కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యలో రైల్వే సిగ్నల్ పడడంతో రైలు ఆగింది. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు కిటికీలోంచి కల్పన మెడలో ఉన్న రెండున్నర తులాల మంగళసూత్రాన్ని దొంగిలించారు. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం కర్నూల్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు రైల్వే సిఐ తెలిపారు.