ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ రవి కిశోర్
రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్నా ఏసీబీ అధికారులు
పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నీటిపారుదల ఏఈ రవి కిశోర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ రైతు పొలానికి నీరు పారేందుకు వీలుగా చిన్న కల్వర్టు కట్టినందుకు ఏఈ రవి కిశోర్ బెదిరించారు. ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీని కోసం లంచం డిమాండ్ చేశారు. తొలుత రూ.10 లక్షలు డిమాండ్ చేసి.. రూ.7 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ. లక్ష ఇవ్వాలని అడగడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం.. పటాన్‌చెరు ఇంజినీరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు కిశోర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.