అలకవీడిన గంటా
మంత్రి గంటా శ్రీనివాస్‌రావుతో మంత్రి చిన్నరాజప్ప చర్చలు
అర్థగంటపాటు గంటాను బుజ్జగించిన ¬మంత్రి
చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన గంటా
సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని వెల్లడి
పార్టీ సర్వేతో గంటా మనస్థాపం చెందారన్న చిన్నరాజప్ప
గంటా భీమిలి నుంచే పోటీ చేస్తారని స్పష్టీకరణ
విశాఖపట్నం, జూన్21(జనం సాక్షి) : టీడీపీ అధినాయకత్వం తీరుతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాయబారంతో అలకవీడారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనకు వస్తుండటం.. తన నియోజకవర్గం భీమిలి పరిధిలో పలు కార్యక్రమాలు పాల్గొంటుండటంతో.. సీఎం కార్యక్రమాలకు వెళ్లాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గంటాను చినరాజప్ప స్వయంగా దగ్గరుండి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబుతో విభేదాలు, విశాఖ భూకుంభకోణానికి సంబంధించి తనకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో టీడీపీ పాత్ర ఉండటంతో మంత్రి గంటా అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో భీమిలిలో వెనకబడ్డారని సంకేతాలివ్వడంతో ఆయనలో అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా.. మంగళవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి సైతం దూరంగా ఉండి.. తన అసమ్మతిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గంటాను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దింపింది. గురువారం ఉదయం గంటా నివాసానికి చేరుకున్న చిన రాజప్పతో పాటు యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణెళిశ్‌కుమార్ తదితరులు ఉన్నారు. గంటాతో సమావేశమై మంతనాలు జరిపారు. ముఖ్యంగా భీమిలిలో చంద్రబాబు పర్యటనకు హాజరుకావాలని, ఆయన నిర్వహించే సభలో పాల్గొనాలని చిన రాజప్ప గంటాను బుజ్జగించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా ఫోన్‌లో మాట్లాడారు. కాసేపటి తర్వాత గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప సంయుక్తంగా విూడియా సమావేశంలో పాల్గొన్నారు. గంటా ముఖ్యమంత్రి పర్యటనలోనూ చిన్నరాజప్ప పేర్కొన్నారు. పాల్గొంటారని పేర్కొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లోనూ భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇటీవల పార్టీ చేసిన సర్వేలో భీమిలిలో గంటాకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రావడంతో ఆయన మనస్తాపం చెందారని తెలిపారు. పనిచేసే మంత్రిపై ఇలాంటి సర్వే రావడం దురదృష్టకరమని.. వచ్చే ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి మరోసారి పోటీ చేసి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీమిలిలో తనపై ప్రజా వ్యతిరేకత ఉన్నది అవాస్తవం ా మంత్రి గంటా
భీమిలిలో తనపై ప్రజా వ్యతిరేకత ఉందన్నది అవాస్తవమని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురవారం విూడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. పోటీలో నెగ్గి తీరుతానని పార్టీ నాయకత్వానికి చెప్పదల్చుకున్నానని మంత్రి గంటా పేర్కొన్నారు. మధ్యాహ్నం సీఎం కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.