అవతరణ కల్లా లక్ష్యం నెరవేరాలి: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,మే25(జ‌నంసాక్షి): జనగామను ఓడిఎఫ్‌గా నిలపాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించుకునే లక్ష్యంతో చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇం దుకు గ్రామస్థాయిలో ప్తరి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రధానంగా సర్పంచ్‌లో గ్రామాల్లో ఇంకా మరుగదొడ్లు నిర్మించుకోని వారనిని గుర్తించి వారిని చైతన్యం చేయాలన్నారు. ఇందులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. జిల్లాలో వందశాతం ఓడీఎఫ్‌గా చేసుకునేందుకు ప్రతీ జిల్లా అధికారి ఒక ఊరిని దత్తత తీసుకోవాలని, బహిరంగ మల విసర్జన వల్ల కలిగే దుష్పచ్రారాన్ని గ్రామ ప్రజలకు తెలియచేయాలన్నారు. ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోని వారిని చైతన్యం చేసే విధంగా గ్రామంలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు కార్యక్రమం విజయవంతం చేయడంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు చేసిన సేవలు హర్షణీయమని అన్నారు. అదే స్కఫూర్తితో ఈ కార్యక్రమంలో పనిచేయాలన్నారు. సీఎంకు రెవెన్యూ ఉద్యోగులపై అపార నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెవెన్యూ అధికారులు రైతు బంధు పథకాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. ప్రతీ రైతుకు ప్రభుత్వం అందించిన నూతన పాసుపుస్తకాలను చేరవేడం, పెట్టుబడి చెక్కులను అందించడం సాహసమైన చర్యగా అభివర్ణించారు.