అవార్డు గ్రహీతలకు చిరు అభినందనలు
జాతీయచలనచిత్ర అవార్డులు సాధించిన వారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నుంచి ’కలర్ ఫోటో’ టీం కి.. అలాగే ’నాట్యం’చిత్ర యూనిట్‌లకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. అలాగే,
’తమిళంలో అవార్డులను అందుకున్న ’ఆకాశం నీ హద్దురా’ చిత్ర దర్శకురాలు సుధా కొంగర, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ లకి అలాగే, మళయాళం నుంచి ’అయ్యప్పణం కోషియం’ టీం అందరికీ బెస్ట్ కంగ్రాట్స్’ అని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,పూజా హెగ్డే జంటగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చి భారీ హిట్ సాధించిన అల వైకుంఠపురములో సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ దక్కినందుకు చిరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.