అవినీతికి పాల్పడిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి
గత మూడు సంవత్సరాలుగా పదవిలో ఉన్న ఇలాంటి కమిషనర్ను ఎప్పుడూ చూడలేదు
6,12 ,22 వ వార్డుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న చూసే పరిస్థితి లేదు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై21(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్ ఫై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు పేర్కొన్నారు గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కమిషనర్ యూసుప్ తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ మున్సిపల్ అభివృద్ధికి అవరోధంగా పరిణమించారని అన్నారు. విధులు నిర్వహించకుండా కనీసం సిడిఎంఏ నుండి వచ్చిన ఉత్తర్వులను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని అటు నిర్ణీత సమయంలో విధులకు హాజరవ్వకుండా లంచ్ టైం లో వచ్చి లంచ్ చేసి సంతకం పెట్టి వెళ్తున్నారని అన్నారు మునిసిపల్ అభివృద్ధికి విఘాతం కలిగించేలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనున్న హరితహారం లో భాగంగా ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలపై దృష్టి వహించడం లేదని గత 25 రోజులుగా విధులకు హాజరు కావడం లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వవలసిన నేపథ్యంలో వర్షాకాలంలో రోగకారక కీటకాలు ఉత్పన్నం కాకుండా ఫాగింగ్ చేయడం లేదని ఈ విషయంలో అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం లేదన్నారు అధికారులు పాలన సౌలభ్యం లోను అభివృద్ధిని కాంక్షించడంలో ముందుంటారని కమిషనర్ ఇందుకు భిన్నంగా ఉన్నారని గత మూడేళ్లుగా పదవిలో కొనసాగుతున్న ఇలాంటి కమిషనర్ను చూడలేదన్నారు. అవినీతి పాల్పడిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. 6 నెలల నుంచి విది దీపాలు పనిచేయడం లేదని మున్సిపల్ కమిషనర్ కు ప్రజాసమస్యల పై అవగాహన లేదన్నారు. మిషన్ భగీరథ పనులు తమకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు అవస్థలు పడుతున్నా ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.
కనీస సమాచారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతు ప్రోట్ కాల్ పాటించకుండా కొంత మంది కౌన్సిలర్ల ను వెంట పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు.
పట్టణ ప్రగతి లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని
6,12, 22 వార్డుల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న చూసే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇండ్ల కూల్చివేతలకు పాల్పడుతూ అక్రమ వసూళ్ల పర్వాన్ని చేపడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, సీడీఎంఎకు ఫిర్యాదు చేశామన్నారు. చరవాని ద్వారా కమిషనర్ ను చైర్మన్ స్రవంతి సంప్రదించగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వెళుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. త్వరలో కమిషనర్ తీరును స్థానిక ఎమ్మెల్యే మంచి రెడ్డీ కిషన్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు.