అవినీతికి మారుపేరు వాద్రా సోనియా అల్లుడిపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

 

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) :

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచ లన ఆరోపణలు చేశారు. వాద్రా అవినీతికి మారుపే రని తీవ్రస్థాయిలో విమర్శిం చారు. వాద్రా పన్నులు ఎగవేశారని, ఆస్తులను తక్కువ రేటుకు కొన్నారని, వడ్డీ లేని, సెక్యూరిటీ లేని తీసుకున్నారని, కేజ్రీవాల్‌ ఆరోపించారు. మూడు వందల కోట్ల ఆస్తులను వాద్రా 50 లక్షలకే కొన్నారని కేజ్రీవాల్‌ వెల్లడించారు. వాద్రాకు డీఎల్‌ఎఫ్‌ తక్కువ రేటుకు ఆస్తులు ఎందుకు అమ్మిందని ప్రశ్నించారు. వాద్రా ఆస్తుల కొనుగోలుకు డీఎల్‌ఎఫ్‌ వడ్డీ, సెక్యూరిటీ లేని రుణాలను అవినీతికి మారుపేరు .ఎలా ఇచ్చిందో వివరించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు ఇచ్చిన భూములపై, వాద్రా రాజస్థాన్‌లోని బికనీర్‌లో కొన్న భూములపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2007లో 50 లక్షల విలువున్న వాద్రా కంపెనీ 500 కోట్లకు చేరిందని విమర్శించారు. 2012లోనే వాద్రా 12 కంపెనీలకు పెట్టాడని ఇది ఎలా సాధ్యమైందో ఆయనే వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. 15 మంది అవినీతి మంత్రులపై విచారణ ఎందుకు జరపలేదని నిలదీశారు. దీనిపై కాంగ్రెస్‌ వర్గాలు, కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ఆరోపణలపై స్పందించేందుకు వాద్రా అందుబాటులో లేరని, అయినా ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ మాట్లాడుతూ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో కేజ్రీవాల్‌ తన పార్టీకి లాభం చేకూర్చడానికే నెహ్రూ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.