అవినీతిపరులకు పదవులు, టికెట్లు ఇవ్వం
భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ : అవినీతికి దూరంగా నేతలు ఉండాలని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. పార్టీలో పదవులు, ఎన్నికల టికెట్లు అవినీతి ఆరోపణలు నిరూపితం అయిన నేతలకు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజ్‌నాధ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాల్సిన అవసరం అద్వానీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. భాజపాలో ఉన్నవారంతా గంగా జలం అంత స్వఛ్ఛమైనవారని తాను అనడం లేదని అన్నారు. అయితే అవినీతి ఆరోపణలు నిరూపితం అయిన నేతలకు పార్టీలో పదవులకు అవకాశం లేదని ఎన్నికల టికెట్లు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తామని చెప్పారు.