అవినీతి పాలనతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు
ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థత్వాన్ని నిరసిస్తూ భారీగా ప్లకార్డులతో నిరసన ర్యాలీలు
ఇటిక్యాల ఎంపీపీ స్నేహ, జడ్పీటీసీ హనుమంత్ రెడ్డి
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 1 : అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం, తన కుమారుడు అజయ్ ఇసుక మాఫియా, అవినీతి పాలనతో నియోజకవర్గంలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు విసిగిపోయారని ఇటిక్యాల ఎంపీపీ స్నేహ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రవల్లి చౌరస్తా వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీలు చేపట్టారు. అంతకు ముందు ఎరవల్లిని నూతన మండలంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్నేహ, జడ్పిటిసి హనుమంతు రెడ్డి, సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. కానీ అలంపూర్ నియోజకవర్గంలో మాత్రం అబ్రహం పాలన వలన అభివృద్ధి కుంటిపడి ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని వారు మండిపడ్డారు. అబ్రహం అసమర్థ పాలన వలన అలంపూర్ నియోజకవర్గానికి ఒక్క డబల్ బెడ్ రూమ్ నిర్మాణం కూడా చేపట్టలేదు వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల నుంచి ప్రతి పనికి కమిషన్లను తీసుకుంటా బిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ కార్యకర్తలు అవమానాలకు గురయ్యే విధంగా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే అబ్రహం ఒంటెద్దుపోకడతో కార్యకర్తలను పట్టించుకోకుండా కమిషన్ల కోసం పనులు చేయడం వల్లన బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత కెసిఆర్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిగిస్తున్నారన్నారని విమర్శించారు.
ఇప్పటికైనా అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి అంశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జిల్లా ఇంచార్జి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి లు పునరాలోచన చేసి బి ఫాం మార్చి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, అలంపూర్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, వల్లూరు ఎంపీటీసీ విజయ్ కుమార్, సాసనూలు సర్పంచ్ మల్లన్న, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, కోటిరెడ్డి, వల్లూరు రవి ప్రకాష్, సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, నాగ బలిమి, లక్ష్మీనారాయణ రెడ్డి తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.