అవినీతి మంత్రులను తొలగించాలి

జనగామ జూన్‌ 6 :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల చేతుల్లో కీిలు బొమ్మలుగా మారి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని  అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ జనగామ డివిజన్‌ కార్యదర్శి ఆందె అశోక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్తానిక పార్టీ కార్యాలయంలో చేర్యాల మండల కార్యదర్షి రామగల్ల నరెష్‌ అధ్యక్ష్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగాని తనం వల్ల పేద ప్రజల సొమ్మును దోచుకుంటు మద్యం మాఫియా తో భూమాఫియా దారులు కుమ్ముక్కై అధికారాన్ని ఆడ్డుపెట్టు కొని అందినంత దోచుకు తింటున్నారని విమర్శించారు. పేద ప్రజలకు శాపంగా మారి పెట్రోల్‌, డిజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటి పోయాయని ధరలు నియత్రించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని లేకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రాబోయె రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారని అన్నారు. అవినీతి ఆధికారులను, మంత్రులను శిక్షించేత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో, బాబు, వినయ్‌, హరిపాండ్‌, రాజు, కిషొర్‌, శివక్రిష్ణా, విష్ణువర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.