అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్‌ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారలాంఛనాలతో భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబునాయడుతోపాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో పెద్దఎత్తున ప్రముఖులు పాల్గొని తమ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు బాధాతప్త హృదయాలతో తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికారు.