అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మంది అరెస్టు

 హైదరాబాద్: శామీర్ పేట లియోనియా రిసార్టుపై పోలీసులు దాడులు చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మంగోలియా, సోమాలియా, నైజీరియా దేశాలకు చెందిన 8 మంది యువతులు, ఇద్దరు భారతీయులున్నట్లు తెలుస్తోంది.