అసమ్మతే టిఆర్‌ఎస్‌లో అసలు సమస్య

ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు
దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో టిక్కెట్లు దక్కిన వారికి అసమ్మతి పోటు తప్పేలా లేదు. మనస్పర్ధలు విడనాడి రాబోయే ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలనే సంకేతాన్ని కెసిఆర్‌ ఇప్పటికే ఇచ్చారు.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరాస అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముందస్తు ఎన్నికలపై తెరాస నేతల్లో మిశ్రమ భావనలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నా.. అంతర్గతంగా ఎవరికివాళ్లు తర్జనభర్జన పడుతున్నారు. మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతానికి అసమ్మతే తమ ప్రధాన ప్రత్యర్థి అని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఇంకా అభ్యర్థుల ఖరారు కాకున్నా..
తెరాసకు చెందినే పలువురు అభ్యర్థులు తమ గెలపుకోసం చెమటోడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు నిర్మల్‌ పట్టణంలో సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఉమ్మడి
జిల్లా వ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెన్నూరు మినహా మిగిలిన అన్ని చోట్లా తెరాస సిట్టింగ్‌లకే టికెట్లు ప్రకటించింది. దీంతో చెన్నూర్‌, బోథ్‌, మంచిర్యాల, ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో ఆశావాహుల్లో అసమ్మతి ఇంకా చల్లారలేదు. ఇటీవల నిర్మల్‌ పట్టణంలో ఇద్దరు మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశమయ్యారు. ఓటర్ల నమోదు గురించి చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పైకి చెప్పినా అసమ్మతి నేతలను కట్టడి చయడంపైనే ప్రధానంగా చర్చించారని సమాచారం.
గత ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముథోల్‌, నిర్మల్‌, సిర్పూరు కాగజ్‌నగర్‌ తప్ప మిగిలిన అన్నిచోట్లా తెరాస విజయం సొంతం చేసుకుంది. మారిన రాజకీయ సవిూకరణలతో వాళ్లు కూడా తెరాసలో చేరారు. దీంతో అంతా అధికార పక్షంలోనే కొనసాగారు. తెరాస నుంచి గెలుపొందిన అభ్యర్థులకు.. ఇతర పార్టీల నుంచి చేరినవాళ్లతో ఇబ్బందులు తప్పట్లేదు. టికెట్‌ వస్తుందనే ఆశతోనే ఇన్నాళ్లు ఎదురుచూడగా.. తీరా సిట్టింగ్‌లకే టికెట్లు ప్రకటించడంతో వాళ్లంతా నిరాశతో ఉండిపోయారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లేమో.. ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టికెట్లు వచ్చిన వాళ్లంతా ఎలా గెలవాలనే ఆలోచన చేస్తున్నారు. వర్గాలు వీడి తెరాస గెలుపే లక్ష్యంగా పనిచేద్దామనే నినాదం ఇస్తున్నారు. కానీ.. వీళ్ల మాటలు ఆశావాహులు, అసమ్మతి వాదులను సంతృప్తిపరచడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా అధికారంలో ఉన్న సమయంలో తమను ఖాతరు చేయలేదని వారంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా విూతో కలిసి పనిచేయాలంటే అంత సులువు కాదు. ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఇటువంటి సమస్యలొచ్చాయన్న భావన ఉంది. అయినా అవతలిపార్టీ నేతల బలహీనతలు, వర్గాలే గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తెరాసలో ఉన్న అసమ్మతిని చక్కబెట్టడానికి రాష్ట్ర అధినాయకత్వం జోక్యం చేసుకోవాలనొ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతూ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేయాలనే అభిప్రాయపడ్డారు.