‘అసెంబ్లీ సమావేశాల తర్వాత హైదరాబాద్లో కనిపించొద్దు’

నిజామాబాద్: మిషన్ కాకతీయను పవిత్ర యజ్ఞంలా చేపట్టండి… తెలంగాణ ఉద్యమంలా మిషన్ కాకతీయను జయప్రదం చేయండంటూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో మిషన్ కాకతీయకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో పనులు చేయకుండా నిధులు తీసుకున్న దొంగ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు.

ఇప్పుడు పనులు సక్రమంగా చేయకుంటే జైలుకైనా పంపించడానికి తాము వెనుకాడమని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్లో కనిపించొద్దని సూచించారు. కర్రవిడిచి సాము చేయొద్దు, గ్రామాల్లోకి వెళ్లి మిషన్ కాకతీయ పనులు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు.