అసోంలో ‘పంచాయతీ’ ఉద్రిక్తత, హింస

 19 మంది మృతి
గువాహటి, (జనంసాక్షి) :
అసోంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గౌల్‌పురా జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదలైన హింస తీవ్రరూపం దాల్చింది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు బుధవారం మరోసారి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దీంతో మంగళవారం నుంచి జరుగుతున్న అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. పోలీసు కాల్పుల్లోనే 13 మంది మృతి చెందగా… అల్లర్లలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. స్థానిక రాభా హజోంగ్‌ స్వయం ప్రతిపత్తి జిల్లా మండలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ గిరిజన వర్గాలు దాడులకు దిగడంతో హింస మొ దలైంది. వీరికి వ్యతిరేకంగా మరో వర్గం వారు ఘర్షణకు దిగడంతో పరస్పర దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మంగళవారం నుంచి మొదలైన ఘర్షణలు బుధవారం కూడా చోటు చేసుకున్నాయి. బుధవారం నాటి కాల్పుల్లో ఆరుగురు మృత్యువతా పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 19కి చేరింది. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. అదనపు బలగాలను మోహరించింది. గౌల్‌పురా జిల్లాలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర ¬ం శాఖ కార్యదర్శి జ్ఞానేంద్ర త్రిపాఠి తెలిపారు. సైన్యం, సాయుధ బలగాలను మోహరించినట్లు చెప్పారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి తరుణ్‌ గగోయి నష్ట పరిహారం ప్రకటించారు.