అసోంలో స్వల్ప భూకంపం
గువహటి,జూన్11(జనం సాక్షి): : అసోంలో సోమవారం మధ్యాహ్న సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయబ్రాంతులై పరుగులు తీశారు. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 నమోదవగా, భూప్రకంపనలకు నాగోన్ జిల్లా ధింగ్‌కు 22 కిలోవిూటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్ సెంటర్ పేర్కొంది. కాగా, ఆస్తి, ప్రాణనష్టం వివరాలపై ఇంకా సమాచారం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.