అస్సాంలో కొనసాగుతున్న హింసాకాండ
కోక్రాఝూర్: అస్సాంలోని కోక్రాఝూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రారంభమైన హింపాకాండ ఆదివారం చిరాంగ్ జిల్లాకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతిచెందారు. చిరాంగ్ జిల్లాలోని మంగోలియన్ బజార్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇక్కడ ఆదివారం మూడు మృతుదేహలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కోక్రాఝూర్‌లో మృతుల సంఖ్య 12కు చేరింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.