అహ్లూవాలియా సీఎంను ప్రశంసించడం హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశంసించడం హాస్యాస్పదమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీటీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పడం నిజాలు తొక్కిపెట్టే ప్రయత్నమేనన్నారు. అతితక్కువ వృద్ధి రేటుకు కాంగ్రెస్‌ నేతల నిర్వాకమే కారణమని యనమల విమర్శించారు.