ఆంధ్రలో తెలంగాణ లారీలను నిలిపేసిన ఎమ్మెల్యే ఆళ్ల నానీ
మెదక్: ఆంధ్రలో తెలంగాణ ప్రాంత లారీలను నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద తెలంగాణకు చెందిన క్వారీ లారీలను ఎమ్మెల్యే నానీ అడ్డుకున్నారు. రోడ్లు పాడవుతున్నాయని లారీలను నిలిపివేశారు. దీంతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేటలో ధర్నాకు దిగి ఆంధ్రప్రాంత లారీలను అడ్డుకున్నారు. ఆంధ్ర ప్రాంత లారీలు ఇక్కడ తిరిగితే రోడ్లు పాడవుతలేవా అంటూ ఆయన ప్రశ్నించారు.