ఆంధ్రాభవన్ మా సొత్తు
– మాకే కేటాయించండి
– కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
హైదనాబాద్,జూన్ 23(జనంసాక్షి):ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేందరాన్ని కోరారు. ఇది తెలంగాణ వారసత్వ సంపదని అన్నారు. నిజాం నుంచి తీసుకున్న వివిధ భవనాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలమని అన్నారు. దీనిని తెలంగానకు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సిఎం లేఖ రాశారు. ఈ సందర్బంగా ఏపీ భవన్ హైదరాబాద్ స్టేట్‌కు చెందిన ఆస్తి అని, దానిని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాల్సిందేనన్నారు. ప్రస్తుతం ఏపీ భవన్ ఉన్న ప్రాంతమంతా ఒకప్పటి హైదరాబాద్ స్టేట్‌కు చెందినదని, మొత్తం 18.8 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. అప్పట్లో భారత ప్రభుత్వం హైదరాబాద్ హౌస్‌తో పాటు 7.5 ఎకరాల పటౌడి హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇనిస్టిట్యూట్ తీసుకుని ప్రత్యామ్నాయంగా అప్పటి ఏపీ ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయించారన్నారు. అలాగే నిజాం ఆస్తులను తెలంగాణకు అప్పగించాలని, వనాలను ఉమ్మడి వనరుల నుంచే నిర్మించారని ఆ లేఖలో పేర్కొన్నారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలాన్ని మొత్తం తెలంగాణకే కేటాయించాలని, దానిపై హక్కులు తెలంగాణకు మాత్రమే ఉంటాయని అన్నారు. ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల మేరకు 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్థుత హైదరాబాద్ హౌస్, తెలంగాణభవన్‌లు ఉన్నాయి. ఆ తరువాత పరిణామాల్లో భారత ప్రభుత్వం హైదరాబాద్ హౌస్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకు బదులుగా పటౌడీ హౌస్‌లో 7.56 ఎకరాలు, నర్సింగ్ ఇన్సిస్టీట్యూట్‌లో 1.21 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆరవ నిజాం పరిపాలనలో ఈ ప్రాంతమంతా హైదరాబాద్‌దేనని గుర్తు చేశారు.