ఆకతాయి ఫోన్‌కాల్‌తో ఆగిన పెళ్లి
గోదావరిఖని : పెళ్లి కుమారుడికి ఓ అకతాయి చేసిన ఫోన్‌కాల్‌తో ఈరోజు ఉదయం జరగాల్సిన ఒక వివాహం అగిపోయింది. పెళ్లికుమార్తెను తాను ప్రేమించానని, ఫోనులో అకతాయి చెప్పడంతో మగపెళ్లివారు పెళ్లి విరమించుకున్నారు. ఎస్‌టీపీసీ జ్యోతినగర్ అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతికి నగునూరు గ్రామానికి చెందిన కోట కనకయ్యతో ఈరోజు ఉదయం వివాహం జరగాల్సి ఉంది. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవద్దంటూ రమేష్ అనే యువకుడు పెళ్లి కొడుకు కనకయ్యకు ఫోన్ చేశాడు. దాంతో పెళ్లి కొడుకు బృందం పెళ్లి మండపానికి రాలేదు. జరిగిన విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన అకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.