ఆకర్శక్‌ పథకంతో దెబ్బతినేది బిజెపియేనా?

కెసిఆర్‌ మరోమారు చేరికలకు ప్రాధాన్యం
రేవంత్‌ రెడ్డి దృష్టి కూడా చేరికలపైనే
హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి ): ఒక్క హుజూరాబాద్‌తో ఇప్పుడు తెలంగాణలో ఆకర్శ్‌ పథకానికి సిఎం కెసిఆర్‌ మళ్ల ఈప్రాణం పోశారు. హుజారబాద్‌లో గెలవడం ఎంత ముఖ్యమో అంతగా బిజెపిని మానసికంగా దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఇప్పుడు పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా అదే పద్దతిలో ముందుకు సాగుతున్నారు. దీంతో బిజెపిలో ఉన్న కాంగ్రెస్‌ వారు కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి పోవడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి, రమణ, కౌశికి రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా చేరుతారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ అనే భేదం లేకుండా,వివిధస్థాయిలకు చెందిన ప్రజాప్రతినిధులతో సహా వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, వందలమంది ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారు. అధికారంలో ఉండడం, తిరుగులేని పార్టీగా కొనసాగడం కొంతకాలమో ఉండి అనేకానేక కారణాల వల్ల పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా సహజంగా మారింది. ఇది అనైతికమనే వారు అంటుంటే..రాజకీయ పునరేకీకరణ అన్ని అర్థంలో కెసిఆర్‌ తీసుకుంటున్నారు. పార్టీ మారుతున్నవారి దృష్టిలో తాము మరో పార్టీలో చేరుతున్నామనే భావన కన్నా రాకీయ ప్రయోజనం ముఖ్యమని గమనించాలి. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవడం కారణంగా చేరుతున్నారని అంటున్నారు. సాధించుకున్న తెలంగాణను అస్థిరపరచడానికి కూడా వరుస కుట్రలు జరిగాయని కెసిఆర్‌ వాదనగా ఉంది. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమవుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పదేపదే చెబుతున్నారు. తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని చెబుతున్నారు. అర్థమవుతుంది. విభజించి పాలించు పద్ధతిన టిఆర్స్‌ పార్టీలను విడదీయడానికీ యత్నిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా అస్థిరపరిచే కుట్ర జరిగిందని కెసిఆర్‌ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇతర పార్టీల్లో ఎవరు కూడా బలంగా ఉండరాదని విశ్వసిస్తున్నారు. తెలంగాణ
బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి చేరికతో పార్టీ,ప్రభుత్వం మరింత బలపడుతున్నది. ఇటీవల చేరిన వారంతా రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమైనామని ప్రకటించారు. మొత్తంగా ఏదేమైనా ఇప్పుడు అంతా టిఆర్‌ఎస్‌ చుట్టూ రాజకీయం సాగుతోంది. ఇకపోతే టిఆర్‌ఎస్‌ లాగే రేవంత్‌ కూడా పాత కాంగ్రెస్‌ వాదులను రప్పించే యత్నాల్లో ఉన్నారు. అలాగే టిడిపిలో మిగిలిన వారిని కూడా రప్పించే యత్నాల్లో ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు నష్పటోయేది బిజెపి మాత్రమే.