ఆకాంక్ష ఉంటే ఐఏఎస్ సాధించొచ్చు
కరీంనగర్ ఎడ్యూకేషన్, ఏప్రిల్ 8 (జనంసాక్షి): ఆకాంక్ష , అవగాహన ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించడం కష్టతరమేమి కాదని ’21వ సెంచరి ఐఏఎస్ అకాడమీ’ (హైదరాబాద్) డైరెక్టర్ పీవీవీ కృష్ణ ప్రదీప్ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక బోధనకుడు), తెలుగు లిటరేచర్ (ఐఏఎస్) బోధకుడు అకెళ్లా రాఘవేంద్ర పేర్కొన్నారు. స్థానిక వావిలాలప్లూలోని అల్ఫోర్స్ ఇ-టెక్నొ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఐఏఎస్ ఓరియం కార్యక్షిమానికి వారు హాజయ్యారు. ఈ సందర్భంగా వారు సివిల్ సర్వీసెస్‌పై పలు అంశాల్లో విద్యార్థులకు, పేరెంట్స్‌కు అవగాహన
కల్సించారు. విద్యార్థులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులపైనే దృష్టి మరల్చకుండా సివిల్ సర్వీసెస్‌పై కూడా అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని సూచించారు.