ఆక్రమణల తొలగింపు
భువనగిరి : భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ `హన్మకొండ రహదారిపై ఉన్న అక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శిల్ప హోటల్ నుంచి అక్రమణలను తొలగించే కార్యక్రమంలో సుమారు 200 మంది సిబ్బంది. పోలీస్ బలగాలు తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నాయి. రోడ్డు మధ్య నుంచి 40 అడుగుల వరకు ఉన్న అక్రమనలను అన్నింటినీ తొలగిస్తున్నారు. దీని కోసం రెండు జేసీబీలను వినియోగించారు. పట్టణ కమిషనర్ కుమారస్వామి , ఇంజీనీర్ పట్టాభిలు పనులను పర్యవేక్షిస్తున్నారు.