ఆక్వా చెరువులతో కాలుష్య సమస్యలు

కాకినాడ,జూన్‌27(జ‌నం సాక్షి): అనధికారికంగా వందల సంఖ్యలో ఆక్వా చెరువులకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని దీంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ చెరువుల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. దీని వల్ల తాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా ప్రజలు నానా వ్యాధులబారిన పడుతున్నారని తెలిపారు.అక్రమ ఆక్వా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆక్వా చెరువు 5 నుంచి 10 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఉండాలన్నారు. కాని చాలా చెరువులు 100 హెక్టార్లలో ఉన్నాయన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహారించడం శోచనీయమన్నారు. పంట పొలాలు, ఆవాశాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఆక్వా చెరువుల వల్ల హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటపాలాలు, ఆవాసాల మధ్య ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వరాదన్నారు. వీటి పరిష్కారానికి గ్రామస్తులు ఐక్యంగా పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు.

——