ఆగస్టు 26కు వాయిదా పడిన లోకాయుక్త కేసు

సుభాష్‌నగర్‌,జనంసాక్షి : నగరంలోని 10వ డివిజన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించాలనే ఫిర్యాదు మేరకు ఉప లోకాయుక్తలో సమోటో కింద కేసు నడుస్తుండగా సోమవారం మళ్లీ వాయిదా పడింది. ఈ కేసు ఆగస్టు 26కి వాయిదా పడిందని ఫిర్యాదుదారు లింగంపల్లి సుజాత, శ్రీనివాస్‌ తెలిపారు. నగరపాలక సంస్థలో పని చేసిన గత కమిషనర్‌ అమయ్‌కుమార్‌ రాజకీయ కోణంలో ఫిర్యాదు చేసినట్లు ఉప లోకాయుక్తకు నివేదిక ఇచ్చారని వివరించారు. ఆర్డీవో సంధ్యారాణి నగరపాల సంస్థ అధికారులను, గత కమిషనర్‌ హయంలో చేపట్టిన పనులపై నివేదిక ఇచ్చారన్నారు. ప్రస్తుత కమిషనర్‌ మాత్రం కేసు ఉపసంహారించుకుంటే తాము అభివృద్ధి పనులతో పాటు, సమస్యలు లేకుండా చేస్తామని వివరించినట్లు లింగంపల్లి సుజాత శ్రీనివాస్‌ తెలిపారు. అయితే నిధులు కేటాయించకుండా అభివృద్ధి పనులు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఇప్పటికే డివిజన్‌ అభివృద్ధి కుంటువడిందని, కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.