ఆగస్టు 3న వికారాబాద్ పట్టణానికి మందకృష్ణ మాదిగ రాక
మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్
మోమిన్ పేట జూలై 31 జనం సాక్షి
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మాదిగ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాదులో జరగబోయే మహాసభను విజయవంతం చేసుకునే విధంగా ఈ నెల మూడున వికారాబాద్ నియోజకవర్గ కేంద్రం వికారాబాద్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే సన్నాక సదస్సుకు ఎమ్మార్పీఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సందర్భంగా మర్పల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మాదిగ మరియు మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు ఈ సన్నాక సదస్సుకు వచ్చి దానిని విజయవంతం చేయాల్సిందిగా, అదే విధంగా 70 ఏళ్ల రిజర్వేషన్ల అనుభవ ప్రక్రియలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపాలంటే ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ ఒక్కటే మార్గం తప్ప ఇంకోటి లేదని మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించి రానున్న లోక్ సభ ఎన్నికల కంటే ముందే బిజెపి పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి పెడతామని ఇప్పటివరకు చేయకపోవడంలో ఆంతర్యం ఏందో మాదిగ మాదిగ ఉపకులాలకు తెలియజేసి ఎన్నికలకు వెళ్లాలని అంతకంటే ముందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి వారికి సామాజిక న్యాయాన్ని అందిస్తే తప్ప మీకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగ సామాజిక వర్గం ఓట్లు అడిగే ముఖం మీకు ఎక్కడుందని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఇకనైనా ఆలస్యం చేయకుండా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని తెలిపారు మోమిన్ పెట్ మండల కేంద్రంలో సమృద్ధి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కో కన్వీనర్ రవి సీనియర్, విజయ్, రవికుమార్ ,శంకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.