ఆగస్ట్ చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలు
హైదరాబాద్, జనంసాక్షి: ఆగస్ట్ చివరివారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి రావల్సిన పలు నిధులు రావటం లేదని రమాకాంత్ రెడ్డి అన్నారు.
స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రాంట్లు రావాల్సిన మార్గం సుమగమం అవుతుందన్నారు. ఈ నెలఖరులోగా రిజర్వేషన్లు ఖరారు అవుతాయని ఆయన తెలిపారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు.