ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్ నేతలు
ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఆజాద్‌తో భేటీ కానున్న బృందంలో చిన్నారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లురవి, ఉండవల్లి, చెంగల్రాయుడు, గాదె వెంకటరెడ్డి ఉన్నారు. ఈ భేటీలో అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా మల్లు రవి, ఉండవల్లి అరుణ్‌కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది.