ఆటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి
ఆదిలాబాద్: కలప అక్రమ రవాణాను అడ్డుకునంన అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మోక్రా వద్ద నలుగురు అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టి కలప అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్లు అధికారులపై రాళ్లతో దాడికి దిగి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనలో ఎఫ్‌ఆర్‌వో నాగేశ్వరరావు, డీఆర్‌వో ప్రవీణ్‌మహాజన్, మరో ఇద్దరు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మొత్తం 10 మంది స్మగ్లర్లు దాడిలో పాల్గొన్నట్లు సమాచారం తెలిసింది.