ఆటోబోల్తా ఒకరి మృతి, 21మందికి గాయాలు-ఆసుపత్రికి తరలింపు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ దహేగం ప్రధాన రహదారిపై ఇట్యాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది ఈ ప్రమాదంలో కృష్ణ (20) అక్కడికక్కడే మృతిచెందగా 21మంది కూలీలు గాయపడ్డారు. కాగజ్‌నగర్‌ నుంచి దహేగాం మండలంలోని పత్తిచేనులో కూలీ పనులకు 20మంది ప్రయాణీకులతో వెళుతున్న అటో అదుపుతప్పి బోల్తాపడింది. సంఘటనలో గాయపడిన వారిని కాగజ్‌నగర్‌ ప్రాథమిక అరోగ్యకేంద్రానికి తరలించి చికిత్సచేస్తున్నారు