ఆటోలో 10 నాటు తుపాకులు సీజ్: కానిస్టేబుల్, ఇన్‌ఫార్మర్‌పై స్మగ్లర్ల దాడి
శ్రీకాకుళం: జిల్లాలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. పాలకొండ మండలం గోపాలపురం దగ్గర ఆటోలో తరలిస్తున్న పది నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలు పరస్పరం ఢీకొనడంతో తుపాకులు బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుల్, ఇన్‌ఫార్మర్‌పై స్మగ్లర్ల దాడి చిత్తూరు జిల్లాలోని బిఎన్‌కండ్రిగ మండలంలోని పదోమైలు దగ్గర కానిస్టేబుల్ రమేష్, ఇన్‌ఫార్మర్ దయాళ్‌పై ఎర్రచందనం స్మగ్లర్లు సోమవారం దాడికి పాల్పడ్డారు.రమేష్, దయాళ్ సోమవారం మధ్యాహ్నం కండ్రిగలోని పదోమైలు దగ్గర ఉన్నారు. వీరిని గమనించిన స్మగ్లర్లు పట్టుకుని చితకబాదారు. స్మగ్లర్ల చేతుల్లోంచి తప్పంచుకుని ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయినా వదలిపెట్టకుండా స్మగ్లర్లు రమేష్, దయాళ్‌ను కత్తులతో వెంబడించారు. చివరికి స్మగ్లర్ల బారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం పోలీసులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.