ఆటో డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ నియమాలు పాటించాలి ఎస్సై విజయ ప్రకాష్

మోమిన్ పేట అక్టోబర్ 8( జనం సాక్షి)
మోమిన్ పేట మండలంలోని ప్యాసింజర్ ఆటో అన్నింటికి గుర్తింపు నంబరు ప్రకారంగానే ఆటో డ్రైవర్లు యజమాని వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకుని వారికి ఇచ్చిన నెంబర్ల ద్వారానే ఆటోలు నడపవలసి ఉంటుందని మోమిన్ పేట ఎస్ ఐ విజయ్ ప్రకాష్ పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని ఆటోలను గుర్తింపు నంబర్లు కేటాయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పత్రాలు లేని ఆటోలను వెంటనే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ నంబర్ ద్వారా ఈ ఆటో ఏ ప్రాంతానికి చెందింది అన్నదే వెంటనే కనుగొనవచ్చు.
ఆటో దొంగతనం గురైతే ఇట్టి నంబర్ ద్వారా వాహనం సులువుగా పట్టుకోవడానికి వీలు ఉంటుంది.
 ఈనెంబర్ ద్వారా ఆ వాహనాన్ని ఈజీగా గుర్తించవచ్చు అదేవిధంగా వాహన డ్రైవరు ఎలాంటి తప్పు చేసినా ఆ నంబర్ ద్వారా ఆటో  డ్రైవర్ మరియు ఓనర్ యొక్క వివరాలు తెలుసుకొనవచ్చు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ జయప్రకాష్ పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్ యజమానులు పాల్గొన్నారు
Attachments area