ఆటో &మోటారు వర్కర్స్ యూనియన్ మహాసభను జయప్రదం చేయండి.

తొర్రూర్19 సెప్టెంబర్ (జనంసాక్షి )       ఆటో &మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధమ మహాసభలు సెప్టెంబర్ 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని వాటిని జయప్రదం చేయాలని *భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి* అన్నారు.తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్స్ ను నేడు ఐఎఫ్బి ఆఫీసులో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. సంవత్సరాలకొద్దీ రెక్కల మొక్కలు చేసుకొని చెమటోడ్చిన కార్మిక వర్గానికి ప్రమాదాలు జరిగిన అనారోగ్యానికి గురైన సహాయం కోసం సంక్షేమ బోర్డు కావాలని చేస్తున్న డిమాండ్లు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు. 2019 రోడ్ సేఫ్టీ బిల్లు పూర్తిగా రద్దుచేసి ఆ బిల్లులో ఉన్న ప్రమాదకరమైన అంశాలు కార్మిక వర్గానికి నష్టం తెచ్చే తొలగించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలలో ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి అమలు చేయాలని ఆయన అన్నారు. డబల్ బెడ్ రూమ్ పథకాన్ని,పెన్షన్ పథకాన్ని ఆటో మోటారు రంగ కార్మికులకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 25న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు *ప్రథమ రాష్ట్ర మహాసభకు ఐ ఎఫ్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రాజేందర్ రెడ్డి* 30 జిల్లాల నుండి జిల్లాల నుండి హాజరు ప్రతినిధులు హాజరై తమ సమస్యలను చర్చించుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో &మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు *బల్ల దేవేందర్, హనుమాన్ల రామ్మోహన్ రెడ్డి,నవీన్ రెడ్డి,ప్రసాద్,చింతా నవీన్, వెంకన్న* తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Sent from Email.Avn for mobile