ఆడపడుచులకు అండగా తెరాస ప్రభుత్వం
పిట్లం సెప్టెంబర్ 19( జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హన్మంత్ షిండేఅన్నారు.
మండల పరిషత్ కార్యాలయం వద్ద మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ పేదింటి యువతి పెళ్లికి లక్షా116 రూపాయలు కానుకగా అందిస్తూ, తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపుతున్న మహానేతగా చరిత్రలో నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు ఆర్థికభారం కావద్దనే సంకల్పంతో.. సీఎం కేసిఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వారికి ఆర్థిక చేదోడుగా నిలుస్తూ, తల్లిదండ్రుల్లో భరోసా నింపుతున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. మండలంలో నుతంగా ఏర్పాటు చేసిన వరలక్ష్మి షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకు నూతన వస్త్రాలు విక్రయించాలని యజమానులకు సూచించారు..కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్,జడ్పీటీసీ అరికేల శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నారాయణరెడ్డి,సర్పంచ్ జొన్న విజయ శ్రీనివాస్ రెడ్డి,తెరాస నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.