ఆడపడుచుల ఆనందం కోసమే చీరల పంపిణీ.
చీరలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ గోమాస శ్రీనివాస్.
బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి)
దసరా పండగ వేళ ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని దుగునేపల్లి, మాల గురిజాల, తాళ్ల గురిజాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం పండగ జరుపుకోలేక పోతున్నామనే భావన రాకుండా ప్రతి ఆడపడుచుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో దుగునేపల్లి సర్పంచ్ డోలె సురేష్, మాల గురిజాల సర్పంచ్ గోమాస అశోక్, తాళ్ల గురిజాల సర్పంచ్ రంజిత వెంకటేష్, వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు, టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.