ఆడపిల్లలు పుట్టారని వివాహిత ఆత్మహత్య
సిరిసిల్లపట్టణం, జనంసాక్షి : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారనే ఆవేదనతో సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన కుసుమ రుచిత (26) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అందరికీ మగబిడ్డలు ఉన్నారు. నాకు ఆడ పిల్లలు పుట్టారని తరచూ కుమిలిపోతుండేదని.. చివరికి అదే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. రుచితకు నాలుగేళ్లక్రితం నెహ్రూెనగర్‌కు చెందిన పూర్ణచందర్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆర్ధిక పరిస్థితులు బాగలేకపోవడంతో మానసిక వేదనకు గురైన రుచిత శనివారం అత్తింట్లో ఉరివేసుకుని ఆత్మమత్య చేసుకుందని ఆమె తండ్రి ఆడెపు సిద్ధిరాములు సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల తహసీల్ధార్ జయచంద్రారెడ్డి శవపంచనామా జరుపగా, ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.