ఆడబిడ్డలకు కానుకగా చీరలు పంపిణీ

చీరల పంపిణీ చేస్తున్న ఎంపీపీ, సర్పంచ్,
ఖానాపురం సెప్టెంబర్ 24జనం సాక్షి
 ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అన్నారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ రమ అశోక్ తో కలిసిఎంపీపీ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చెయ్యని  సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రంజాన్ కు ముస్లింలకు, క్రిస్మస్కు క్రిష్టియన్లకు, బతుకమ్మకు హిందువులకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఆడ బిడ్డలు బతుకమ్మ పండుగను అందరూ ఘనంగా నిర్వహించుకోవాలి  అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్  లక్ష్మణ్,ఉప సర్పంచ్ వీరపాక స్వామి ,నాజితాండ సర్పంచ్ బాలకిషన్, వెంకన్న ,గొందినాగేశ్వరరావు,పంచాయతీసెక్రటరీ స్రవంతి, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area