ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలు

జెడ్పీటీసీ మహేశ్ గుప్తా
శివ్వంపేట సెప్టెంబర్ 26 జనంసాక్షి : ఆడపడచులకు సీఎం కేసిఆర్ ప్రభుత్వం అందించే బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరేలను అందించడం జరుగుతుందని జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ చంద్రాగౌడ్, శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డితో కలిసి జడ్పీటీసీ సోమవారం మహిళలకు ప్రభుత్వం నుండి ఉచితంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేశ్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగను అధికారికంగా జరిగించడమే కాకుండా తెలుగుదనం ఉట్టిపడేలా చేనేత బతుకమ్మ చీరలను కూడా అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, కొండల్, పోచగౌడ్, పంబల్ల సంతోష్, గౌరీశంకర్, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు. పిల్లుట్ల గ్రామంలో సర్పంచ్ పెద్దపులి రవి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.