ఆడబిడ్డలకు సర్కారు సారే
-ప్రేమ పూర్వక చిరుకానుక
-ఏడాది పొడుగూత నేతన్నలకు ఉపాధి
*******
-ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
******
సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 22 సద్దుల బతుకమ్మ
పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చిరు కానుకగా సర్కారుసారే అందిస్తుందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ… ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందిస్తున్నాడని తెలిపారు. 2017లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఇప్పటివరకు ఐదు కోట్ల విలువైన చీరలను ఆడబిడ్డలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏడాది దాదాపు 339 కోట్ల విలువగల కోటి బతుక…