Monday, 2 November 2026

ఆడశిశువును రోడ్డుపై పడేసివెళ్లిన తల్లిదండ్రులు

00నల్గొండ : భారతదేశాన్ని భారతమాతగా సంభోదిస్తాము. మాతృభూమిగా కొలుస్తాము. దేవతలను పూజిస్తాము. అన్నీ బాగానేవున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు, వివక్ష పోలేదు.. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకవైపు న్యూ ఇయిర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో మరోవైపు ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంటలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును తల్లిదండ్రులు రోడ్డుపై పడేసి వెళ్లారు. స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించ లేదు. పోలీసుల చొరవతో శిశువును ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *