ఆడిట్ సూపర్డెంట్ మహిళ అధికారి పద్మజ రాణి ని వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి. జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు.
భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ (బిఎమ్ఎస్ )రిజిస్ట్రేషన్ నంబర్ B-1158 ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ని పలు సమస్యల గురించి కలిశారు . సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయంలో మహిళ అధికారి ఆడిట్ సూపర్డెంట్ పద్మజ రాణి ని అదే ఆఫీసులో అధికారి అష్రాఫ్ అలీ సర్కిల్ 29 సూపర్డెంట్ మానసికంగా పరోక్షకంగా పద్మజారాణిని వేధించడమే కాక నీ అంతట నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపొమ్మని బెదిరింపులకు గురి చేస్తున్నారని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కమిషన్ శ్రీనివాసరెడ్డికి లిఖితగా పూరకంగా వ్రాసి అష్రాఫ్ అలీ మీద ఫిర్యాదు చేశారు . నీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి నాకు సంబంధించిన వ్యక్తి దగ్గర వచ్చి మీరు సెటిల్మెంట్ చేసుకోవాలని , లేనియెడల ఏ సి బి. విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తామని పద్మజారాణిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి యూనియన్ సభ్యులతో కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని పద్మజా రాణి వివరించారు . ఇంతకుముందు కూడా అష్రాఫ్ అలీ పై హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసాము అని తెలిపారు. హెడ్ ఆఫీస్ నుండి జోనల్ కార్యాలయానికి అష్రాఫ్ అలీ పై ఎంక్వయిరీ చేయమని సంబంధించిన అధికారులకు సూచించారని పద్మజ రాణి అని తెలిపారు .. యూనియన్ నాయకులు పద్మజారానికి న్యాయం జరిగే వరకు వెంట ఉంటామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జి రాజేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రెటరీ టి కృష్ణ , వైస్ ప్రెసిడెంట్ జి ఆనంద్ కుమార్ , కె అమరేందర్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రెటరీ ఏ శంకర్, సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కొడాలి రాజు, కే బాలకృష్ణ , ఈ శంకర్ లక్ష్మణ్ ఎల్బీనగర్ జోనల్ ప్రెసిడెంట్ ఎం యాదగిరి, ఎం రాధాకృష్ణ , ఖైరతాబాద్ జోనల్ ప్రెసిడెంట్ జి సుదర్శన్ ఆర్ వెంకటేష్ శేరిలింగంపల్లి జోనల్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు