ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: అంటున్న బాజిరెడ్డి నేత
కరీంనగర్: త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు అండాగా వైఎస్‌ఆర్ సీపీ ఉందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలు ఎక్కడ ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ అక్కడే ఉంటుందని చెప్పారు. సమస్యలు లేవంటున్న పాలకులు నేత కార్మికుడు సత్తయ్య మృతికి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.