ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ వ్యవహారంపై పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ప్రియురాలు ఫాతిమా(17), ప్రియుడు అరుణ్‌ కుమార్‌(18) పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ప్రేమికుల పరిస్థితి విషమంగాఇ ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.