ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి జిల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక ఆటోనగర్‌ వెల్‌కంబోర్డు నుండి రాందాస్‌ చౌరాస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు 2కె రన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మెదక్‌ పట్టణ పరిశుభ్రతకు సబ్‌కలెక్టర్‌, మెదక్‌ పురపాలక సంఘ ప్రత్యేకాధికారి భారతి హోళ్లీకేరి తీసుకున్న నిర్ణయాల మేరకు చెత్త వేసే వారికి జరిమాన విధించే బదులు రెండు కిలోమీటర్లు వారిని పరుగెత్తించాలని సూచించారు. పట్టణంలో అన్ని వార్డుల ప్రజలు కానిసెప్ట్‌ ప్రజల కు తెలియాలన్నారు. అన్ని ప్రాంతాల వారు ప్రతివార్డులో బిల్‌ కలెక్టర్‌, మెప్మ సభ్యులు పరిశుభ్రంపై చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ తహశీల్దార్‌ రాంప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌, ఇంజనీర్‌ చిరంజీవి, ఆర్డీఓ, తహశీల్దార్‌ సిబ్బంది, ఎపి రెసిడెన్షియల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌, వెస్లీ బాలికల హాస్టల్‌, గీతా, సిద్ధార్థ పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఎస్‌హెచ్‌జి సభ్యులు, రైస్‌మిల్లర్స్‌ అధ్యక్షుడు చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు.