ఆదర్శ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తుల విధ్వంసం

మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలో కర్రలు, చాకు, ఇనుప రాడ్లు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. పాఠశాలలోని స్టాఫ్ రూమ్ లోని బీరువా, మైక్రోస్కోప్, వివిధ రకాల వస్తువులను కిటికీ లాకులు తొలగించి కర్రలతో వస్తువులను చిందరవందరం చేశారు. గ్రంథాలయంలోని కంప్యూటర్లను పలగొట్టాలని రాళ్లు, ఇనపరాడులను విసిరారు. పాఠశాల ఆవరణం ముందు పార్కు చేసిన కారు అద్దాలను రాళ్లతో కొట్టి పగులగొట్టారు. ఇట్టి విషయాన్ని పాఠశాల అటెండర్ మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరికి ఫోన్ ద్వారా తెలియజేయగా, ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు, పాఠశాలలోని విధ్వంసం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలోని కొంతమంది ఆకతాయిలు పలువురు విద్యార్థినులను వెంబడిస్తున్నారని, కొంతమంది తల్లిదండ్రులు బహిరంగనే చర్చించుకుంటున్నారు, పోలీసు వారు ఇప్పటికైనా ఆకతాయిలను గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు.